ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్ భారత క్రికెట్ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోనుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఘోరంగా ఓటమి పాలైంది. దీంతో 0-4 తేడాతో సిరీస్ కోల్పోయింది. ఈ సిరీస్ కంటే ముందు ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20 సిరీస్‌లోనూ టీమిండియా 0-2తో ఓటమి పాలైంది. వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. టీమిండియా చేసిన ఈ చెత్త ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వరుసగా రెండు సార్లు టీ20 ఛాంపియన్‌గా నిలిచిన జట్టు ఇలా పసికూన ఐర్లాండ్‌పై, ఆ తర్వాత ఇంగ్లాండ్‌పై వరుసగా మ్యాచ్‌లు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు భారత క్రికెట్ అభిమానులు. టీమిండియా ఆటగాళ్లపై, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్లపై సోషల్ మీడియా వేదికగా బూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నారు…
ఇంగ్లాండ్ గడ్డపై భారత జట్టుకు మరో ఘోర ఓటమి ఎదురైంది. ఇంగ్లాండ్ చేతిలో ఇప్పటికే మూడింటిలో ఓడిపోయిన భారత్, శనివారం ఐదో టీ20లో కూడా ఓటమిపాలైంది. ఈ క్రమంలో 4-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది ఇంగ్లాండ్. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఇప్పటికే ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన భారత్, ఇంగ్లాండ్ చేతిలో కూడా అదే పరిస్థితిని కొని తెచ్చుకుంది.
ఇంగ్లాండ్ మ్యాచ్ లోనూ భారత్ ఓటమి
ఐదవ టీ20లో కూడా ఇంగ్లాండ్ చేతిలో భారత్ చిత్తయింది. ఈ మ్యాచ్ లో 56 పరుగుల తేడాతో దారుణమైన ఓటమి చవిచూసింది. ఇందులో ఇంగ్లాండ్ మొదటి బ్యాటింగ్ చేయగా, మూడు వికెట్ల నష్టానికి 257 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్, 20 ఓవర్లు ఆడి… 201 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్రమంలోనే సిరీస్ చివరి మ్యాచ్ లో కూడా ఓడిపోయింది..
ఇది ఐపీఎల్ కాదు..
ఇలా కొన్ని మంచి జరిగే అంశాలు కూడా ఈ సిరీస్ ఓటమితో జరిగే అవకాశం ఉందని, కొంతమంది ఆశావాహులు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. అయినా వాళ్ల పిచ్చి కానీ, టీమిండియా ఎంత దారుణ ఓటములు ఎదుర్కొంటే ఏంటి.. వాళ్లు అనుకున్నదే వాళ్లు చేస్తారు. క్వాలిటీ ప్లేయర్లను కారణం లేకుండా పక్కన పెట్టేస్తారు. వాళ్లకు నచ్చిన ప్లేయర్లను తీసుకొచ్చి, ఇలా అంతర్జాతీయ వేదికలపై దేశం పరువు తీస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇంగ్లాండ్‌కు చెందిన క్రికెట్ ఫ్యాన్స్, భారత క్రికెటర్లను ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారో చూస్తే తట్టుకోవడం చాలా కష్టం. అంతెందుకు ఏకంగా గ్రౌండ్‌లోనే ఐపీఎల్ మ్యూజిక్ ప్లే చేస్తూ టీమిండియాను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. భారీ భారీ సిక్సులు కొట్టేందుకు ఇవి ఇండియాలోని ఐపీఎల్ ఫ్లాట్ పిచ్‌లు కాదని, ఇంగ్లాండ్‌లో గ్రాసీ పిచ్‌లంటూ హేళన చేస్తున్నారు. ఇక్కడ ఆడాలంటే గుడ్డిగా బ్యాట్ ఊపితే సరిపోదు.. స్కిల్స్‌తో ఆడాలి. ఇక్కడ మా బౌలర్లను ఎదుర్కొవడం అంటే.. చిన్న గ్రౌండ్స్‌లో చెలరేగిపోవడం కాదు, నిప్పుతో చెలగాటమే అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ఇంత జరిగినా.. ఇంకా మన సెలెక్టర్లు, బీసీసీఐ పెద్దలు మారకుంటే, ఇలాంటి దారుణాలు ఇంకా చూడక తప్పదు..
చెత్త ఫీల్డింగ్ చేసిన భారత్...
చెత్త ఫీలింగ్ తో అభిమానుల్లో ఆగ్రహాన్ని తెప్పించిన తేమ్ ఇండియా.. అవకాశాన్ని అందుపుచ్చుకోవాల్సిన సమయంలో అడ్డగోలుగా క్యాచీలు మెచ్చేస్తూ ఫీల్డ్ మిస్ చేస్తూ మ్యాచ్ ను చేజార్చుకున్నారు… ఇటీవల ఐర్లాండ్ ఇప్పుడు ఇంగ్లాండ్ ఇలా సీరియస్ లు ఏకదాని తర్వాత మరొకటి వరుసగా కోల్పోతూనే ఉన్నారు.. అయినా అయినా టీమిండియా ప్రదర్శన మాత్రం ఏ మార్పు లేదు…