ఈశాన్య భారతదేశంలోని 8 రాష్ట్రాల మనుగడ ప్రమాదంలో సుమారు 5 కోట్ల మంది ప్రజల ప్రాణాలు ముప్పులో..!
ఈశాన్య భారతదేశంలోని 8 రాష్ట్రాల మనుగడ ప్రమాదంలో పడిందని, సుమారు 5 కోట్ల మంది ప్రజల ప్రాణాలు ముప్పులో ఉన్నాయని చైనాకు చెందిన ప్రభుత్వ భూగర్భ శాస్త్రవేత్తలే హెచ్చరిస్తున్నారు..చైనా నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్ట్ ‘మెదోగ్ హైడ్రోపవర్ స్టేషన్’ వల్ల ఈ ముప్పు పొంచి ఉందని వారి సర్వేలో వెల్లడైంది.
ప్రమాదకరమైన ‘మెదోగ్’ డ్యామ్: భారత్-చైనా సరిహద్దుకు 50 కిలోమీటర్ల దూరంలో, టిబెట్‌లోని బ్రహ్మపుత్ర (యార్లూంగ్ త్సాంగ్పో) నదిపై చైనా ఈ డ్యామ్‌ను నిర్మిస్తోంది.
భూకంపాల ముప్పు: ఈ డ్యామ్ ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలకమైన ‘పాయ్జెన్ ఫాల్ట్ లైన్’ (భూకంప రంధ్రం) మీద నిర్మించబడింది.
ముప్పు: ఒకవేళ అక్కడ 7 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం వస్తే, ఈ డ్యామ్ కూలిపోయే అవకాశం ఉంది. దీనివల్ల వచ్చే భారీ వరదలు ఈశాన్య భారతదేశంలోని 8 రాష్ట్రాలను ముంచెత్తడమే కాకుండా, 5 కోట్ల మందికి పైగా ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తాయి.