హైదరాబాద్…
పార్టీ నేతల జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి..
ఎస్ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారు. దీనిని ఒక అవకాశంగా తీసుకోవాలి.
119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్పై 489 సమావేశాలు జరిగాయి.
బాగా వెనుకబడిన నియోజకవర్గాల్లో ఇప్పటికైనా స్పందించాలి.
చైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని గాంధీభవన్ చుట్టూ తిరగొద్దు. అలాంటి వారికి అపాయింట్మెంట్లు ఇవ్వొద్దు.
రేపటి నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు నాయకులు గాంధీభవన్కు రావొద్దు.
కొందరు నాయకులు హైదరాబాద్లో కూర్చొని పనిచేయడం లేదు.
సోమవారం పది మంది ఇన్చార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో ఎస్ఐఆర్పై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు.
ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నా కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు జరపాలి.
ఇన్చార్జీలుగా వ్యవహరిస్తున్న చోట ఎంపీలు పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తాం.
పార్టీ పరంగా ఎస్ఐఆర్ ఇన్చార్జీలుగా ఉన్న వారు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలి.
ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు, చైర్మన్లు బీఎల్ఓల రిపోర్టుల కంటే బీఎల్ఏల రిపోర్టులను పరిశీలించాలి.
బీఎల్ఓల రిపోర్టుల మీద మాత్రమే ఆధారపడితే కఠిన చర్యలు ఉంటాయి..
పార్టీ పరంగా పనిచేస్తున్న బీఎల్ఏలను నాయకులు సమర్థవంతంగా ఉపయోగించాలి.
పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాలి. హైదరాబాద్ చుట్టూ తిరుగుతామంటే కుదరదు.
వచ్చే పది రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో పర్యటించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్చార్జ్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎస్ఐఆర్కు నియమించిన పార్టీ ఇన్చార్జ్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందే.
బీఎల్ఏ, బీఎల్ఓ రిపోర్టులను గాంధీభవన్ టీం ఎప్పటికప్పుడు పరిశీలించాలి.
ఎస్ఐఆర్ ను ఇన్చార్జ్ మంత్రులు పూర్తి పర్యవేక్షణ చేయాల్సిందే. అన్నింటికీ వారిదే బాధ్యత.
ఈ నెల 30వ తేదీన మళ్లీ పూర్తి స్థాయి సమీక్ష నిర్వహిస్తాం. అసెంబ్లీల వారీగా నివేదికలు తీసుకుంటాం.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జ్లను సమన్వయం చేయాలి. ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్పై సీరియస్గా దృష్టి సారించాలి. బాగా పనిచేసే 100 మంది బీఎల్ఏలకు రాహుల్ గాంధీని కలిసి ఫోటో దిగే అవకాశం కల్పించాలి.