#NBK111 చిత్రీకరణ సందర్భంగా బాలకృష్ణ స్వల్ప గాయాలు..
నందమూరి బాలకృష్ణకు ‘NBK 111’ షూటింగ్లో ప్రమాదం జరిగింది..
కాకినాడ పోర్ట్ యాక్షన్ సన్నివేశంలో మోకాలికి గాయమైంది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, వైద్యులు విశ్రాంతి సూచించారు.
బాలయ్య గాయాల వల్ల షూటింగ్ కొన్ని రోజులు వాయిదా..
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Nalakrishna) కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ‘వీర సింహా రెడ్డి’ విజయం తర్వాత వాళ్ళిద్దరి కలయికలో తెరకెక్కుతున్న తాజా చిత్రమిది. హీరోగా బాలకృష్ణ 111వ సినిమా కావడంతో ‘NBK 111’ను వర్కింగ్ టైటిల్గా పెట్టారు. ఈ సినిమా షూటింగ్లో బాలకృష్ణకు గాయాలు అయ్యాయి.
సినిమాపై ఆయనకున్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం #NBK111 చిత్రబృందంలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తోందని అన్నారు. గాయం అయినప్పటికీ సినిమా పట్ల ఆయన చూపిస్తున్న నిబద్ధత అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.
బాలకృష్ణ త్వరగా కోలుకుని మళ్లీ సెట్స్లోకి రావాలని చిత్రబృందం ఆకాంక్షించింది. ఇదిలా ఉండగా, #NBK111పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గోపీచంద్ మలినేని–బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది..