దేశవ్యాప్తంగా ‘నీట్’ (NEET) పరీక్షల్లో జరిగిన అవకతవకలు, వరుస పేపర్ లీకేజీల వ్యవహారం కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోంది. ఢిల్లీలోని జంతర్మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP), విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలకు విపక్షాలు కూడా మద్దతు తెలపడంతో ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. వీరంతా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం కారణంగా గడిచిన నాలుగు రోజులుగా పార్లమెంట్లోని ఉభయ సభలు వరుసగా వాయిదా పడుతున్నాయి. ‘నీట్’ వ్యవహారంపై సమగ్ర చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టడంతో సభలో నిత్యం ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది…
రాజీనామా లేఖపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని కార్యాలయం (PMO), మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పార్లమెంట్ ఆందోళనల నేపథ్యంలో సంచలనం సృష్టించేందుకు ఎవరైనా నకిలీ లేఖను సృష్టించారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.