ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు చూడటానికి వెళ్లిన, మాజీ ఎమ్మెల్యే కూతురికి లైంగిక వేధింపులు.!.
దేశ వ్యాప్తంగా దీనికి యువత నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంత మంది సెలబ్రీటీలు, ఇండియా కూటమిసైతం నీట్ లీక్ నిరసనలకు తమ మద్దతు ప్రకటించాయి. మరోవైపు జంతర్ మంతర్ వద్ద నిరసనల్లో కొన్ని చోట్ల షాకింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. అమ్మాయిలపై కొంత మంది ఆకతాయిలు వేధింపులకు పాల్పడ్డారు. మరికొన్ని చోట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ఈ క్రమంలో కొంత మంది అల్లర్లకు కారణమౌతున్న వారు తమ నిరసనల్లో వచ్చి చేరి తమకు చెడ్డపేరు తీసుకొని వస్తున్నారని ఇలాంటి ఘటనలతో తమకు సంబంధం లేదని కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. ఈ క్రమంలో యూపీకి చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే తన ఇన్ స్టాలో తనకు జంతర్ మంతర్ వద్ద ఎదురైన వేధింపుల ఘటనను బైటపెట్టారు. దీంతో ఈ ఘటన వార్తలలో నిలిచింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లాకు చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ కూతురు యశస్వీ రాజే సింగ్ జులై 24న జంతర్ మంతర్ వద్దకు వెళ్లారు. అక్కడ అసలు ఏంజరుగుతుందని చూడటానికి వెళ్లారు. పలు చోట్ల బారికెడ్లు ఏర్పాటు చేశారు. ఇంతలో తోపులాట జరగడంతో ఒక చోట చాలా మంది కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన వారు గుమిగూడారు.ఇంతలో యశస్వీ రాజే అక్కడ తోపులాటలో కింద పడిపోయింది. ఆమెను కొంత మంది ఆకతాయిలు లైంగికంగా వేధించినట్లు ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. తన రెండు కాళ్ల మధ్యలోచేతులు పెట్టి చాలా ఘోరంగా ప్రవర్తించారని చెప్పింది. ఈ ఘటనతో షాక్ కు గురైన తాను అతనిపై మూడు సార్లు చెంప దెబ్బలు కొట్టినట్లు చెప్పుకొచ్చింది.
అయితే.. ఈ ఘటన తర్వాత అక్కడున్న ఒక పురుష వాలంటీర్ తనపై పదేపదే అరవగా, మరో వాలంటీర్ .. ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయని ఆ సంఘటనను కొట్టిపారేశారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనతో చాలా ఒత్తిడికి గురైనట్లు యశస్వీ రాజే ఇన్ స్టాలో తనకు ఎదురైన ఘటనను బైటపెట్టింది..మరోవైపు ఈ ఘటనపై మాజీఎమ్మెల్యేను ఫోన్ లో ప్రశ్నించగా.. ఆ సంఘటన గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని ఆ నాయకుడు చెప్పాడు. నిరసన ప్రదర్శనలో తన కూతురితో పాటు తన తల్లి కూడా ఉందని, అక్కడ ఏం జరిగిందో ఆమెకే బాగా తెలిసే అవకాశం ఉందని చెప్పాడు..