జూరాల ప్రాజెక్టు కు పెరుగుతున్న వరద..

మహబూబ్ నగర్ జిల్లా:

జూరాల ప్రాజెక్టు కు పెరుగుతున్న వరద

ఇన్ ఫ్లో: 30,000 క్యూసెక్కులు

అవుట్ ఫ్లో: 16,408 క్యూసెక్కులు

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516. మీటర్లు

ప్రస్తుత నీటిమట్టం..318.15 మీటర్లు.

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు.

ప్రస్తుత నీటి సామర్థ్యం 8.909 టీఎంసీలు.

ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో నాలుగు యూనిట్లలో కొనసాగుతున్న విద్యుత్తు ఉత్పత్తి..

జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉధృతి
కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వరద పోటెత్తడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్ నుంచి 35 వేల క్యూసెక్కుల నీటిని వదులుతుండగా, జూరాలకు ఆదివారం రాత్రికి 22,600 క్యూసెక్కుల ప్రవాహం చేరుకుంది. సోమవారం ఈ వరద మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు..ప్రస్తుతం జూరాల జలాశయంలో నీటి నిల్వ 5.897 టీఎంసీలకు చేరుకుంది. ఇదే స్థాయిలో వరద కొనసాగితే త్వరలోనే శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా నీరు చేరే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు, నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం (ఎంజీఎల్‌ఐ) ద్వారా సోమవారం నుంచి రిజర్వాయర్లకు నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఈఈ లోకిలాల్ ప్రకటించారు. సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లను నింపనున్న నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు..