నయా భారతదేశంలో అంబేద్కర్ ఆలోచన విధానాలు అమలు చేయాలని జాతి కన్వీనర్ చదలవాడ కృపాకర్ మాట్లాడుతూ..
అంబేద్కర్ గారు భూములు జాతీయం చేసి భూ బ్యాంకుల ఏర్పాటు చేసి ఇంటికి మూడు ఎకరాల భూమి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని అని అంబేద్కర్ గారి నొక్కి చెప్పారు.. అలాగే హిందూ బిల్ కోడ్ కూడా అమలు చేయాలని అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంటు బిల్లును ప్రవేశపెడితే ఎవరు దానికి సపోర్ట్ చేయలేదు ఆరోజున పార్లమెంట్లో ఎంపీలందరూ ఈ విధానాన్ని అమలు చేసేలాగా పార్లమెంట్లో చట్టం తీసుకువస్తే ఈ రోజున కులం మతం అనే భేదములేకుండా భారతదేశం అమెరికా కంటే ఎంతో అభివృద్ధి చెందేది అన్నారు .. ఒక్కసారి ఆలోచన చేద్దాం మనకంటే వెనక ఏర్పాటైన రాజ్యాంగం కూడా లేటుగానే ప్రారంభమైంది అక్కడ చైనా ఎంత అభివృద్ధి చెందిందో ఒకసారి ఆలోచన చేయాలి అని అక్కడ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు అమలు చేశారు అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు 10 సంవత్సరాల వరకు రిజర్వేషన్లు అమలు చేయాలి… భూములను జాతీయం చేయాలి భూ బ్యాంక్ ఏర్పాటు చేయాలి… ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి ఇండికేటర్ హాస్టల్స్ ఏర్పాటు చేయాలి ఈ విధానములు చేస్తే రిజర్వేషన్ తో పనేలేదు అవసరం కూడా రాదు అని అలాచేస్తేనే . అదే అంబేద్కర్ కి నిజమైన నివాళులు అన్నారు.