డిఫాల్ట్ మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి రూపాయి, ప్రతి గింజను రికవరీ చేస్తాం..మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
సీఎంఆర్ వ్యవస్థపై గత 10-12 ఏళ్ల కార్యకలాపాలకు సమగ్ర ఆడిట్ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. డిఫాల్ట్ మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి రూపాయి, ప్రతి గింజను రికవరీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్సష్టం చేశారు..రాష్ట్రంలో జిల్లాల వారీగా, మిల్లర్ల వారీగా పెండింగ్ బకాయిలు, రికవరీలు, విజిలెన్స్ కేసులు, న్యాయపరమైన చర్యలపై సమీక్షించాలిని మంత్రి ఉత్తం స్పష్టం చేశారు.
తెలంగాణలో ప్రభుత్వం ధాన్యం దారి మళ్లింప మరియు, ఒప్పంద ఉల్లంఘనలపై క్రిమినల్ కేసులులు నమోదు చేయాలని, బ్లాక్లిస్టింగ్ సహా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సీఎంఆర్ విధానంలో సంస్కరణలు – కఠిన ఒప్పందాలు, బలమైన బ్యాంక్ గ్యారంటీలు, డిఫాల్ట్లపై కఠిన శిక్షలు అమలు చేయాలని మంత్రి తెలిపారు.