ఎమ్మెల్యే అయిన ఏడాదిన్నరలోనే అప్పుల కొండను ఎలా కరిగించారు? కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఖాతాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?.. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్ రావు ,

ఎమ్మెల్యే అయిన ఏడాదిన్నరలోనే అప్పుల కొండను ఎలా కరిగించారు? కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఖాతాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?
2023 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్తులు 54 కోట్లు, అప్పులు 12 కోట్లు, వార్షిక ఆదాయం కేవలం 34 లక్షలు. పైగా ఐటీ శాఖకు కట్టాల్సిన బకాయిలే 1.85 కోట్లు ఉన్నాయి. పదేళ్లుగా బ్యాంకుల దగ్గర డిఫాల్టర్ గా ఉండి ఎన్సీఎల్టీలో కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి, కేవలం 16 నెలల వ్యవధిలోనే 9 బ్యాంకులకు ఏకంగా 470 కోట్ల అప్పులు ఎలా చెల్లించారు?
తన రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన 357 కోట్లు, హోటల్ వ్యాపారానికి సంబంధించిన 87 కోట్లను ఏ విధంగా క్లియర్ చేశారు? బంజారాహిల్స్ లోని ఒక్క బ్యాంకుకే ఒకేసారి 120 కోట్లు చెల్లించి ఎన్ఓసీ ఎలా తెచ్చుకోగలిగారు?
దీనిపై ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఈ వ్యవహారం వెనుక ఉన్న మంత్రి ఎవరు? మొన్న మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు గారు మంచిర్యాలలో రాత్రి బస చేసి తేల్చిన లెక్కలు ఇవేనా? ఈ 470 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాలి.