రానురాను రక్త సంబంధాలు, మానవత్వం కనుమరుగవుతున్నాయనే ఆందోళనకు ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తోంది…!

రానురాను రక్త సంబంధాలు, మానవత్వం కనుమరుగవుతున్నాయనే ఆందోళనకు ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
అనుబంధాలు, ఆప్యాయతలకు విలువ తగ్గిపోతోందా? కంటికి రెప్పలా కాపాడాల్సిన పేగు బంధాలే కాలయముల్లా మారుతున్నాయా? ఒకప్పుడు కష్టసుఖాల్లో తోడుగా నిలిచే కుటుంబ బంధాలు, నేడు స్వార్థం మరియు దూరాల మధ్య బలహీనపడుతున్నాయనే భావన కలుగుతోంది.
హరియాణాలోని సోనిపట్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన పలువురిని కలచివేసింది. తండ్రి మరణించినా ఆయన ముగ్గురు కుమార్తెలు అంత్యక్రియలకు హాజరుకాలేదని సమాచారం. పెద్ద కుమార్తె స్థానిక స్వచ్ఛంద సంస్థ (NGO)కు డబ్బు పంపి, వీడియో కాల్ ద్వారా అంత్యక్రియలను వీక్షించినట్లు తెలుస్తోంది.
అంతేకాక, “అస్థికలు తీసుకుంటారా?” అని అడిగితే “తర్వాత చూద్దాం” అని సమాధానం ఇవ్వడం, “అంత్యక్రియలు ఎప్పుడు పూర్తవుతాయో చెప్పండి, అప్పుడు భోజనం చేస్తాం” అని చెప్పినట్లు ప్రచారంలో ఉన్న వివరాలు మరింత బాధను కలిగిస్తున్నాయి.
ఇలాంటి సంఘటనలు కుటుంబ విలువలు, మానవత్వం, రక్త సంబంధాల ప్రాధాన్యంపై మరోసారి సమాజం ఆలోచించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. అయితే, ఇటువంటి ఘటనల వెనుక వ్యక్తిగత, కుటుంబ లేదా ఇతర తెలియని పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉండి ఉండవచ్చు కానీ రక్తసంబంధం మళ్లీ కంటికి కనిపించని తెలిసి కూడా చూడడానికి కూడా రాలేదంటే ఇది ఎంతటి దారుణమైన ఘటన అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం ఒక వీడియో..
https://www.facebook.com/share/v/1JSrWdrKrG/