ఆగస్టు 10న నాగార్జునసాగర్ వద్ద ఘనంగా వరుణ యాగం పాల్గొననున్న సీఎం రేవంత్..


నల్లగొండ జిల్లా:-

ఈనెల 10వ తేదీన నాగార్జునసాగర్ కి సీఎం రేవంత్ రెడ్డి..!

వరుణ యాగం లో పాల్గొననున్న CM..
కాసేపట్లో.. వరుణ యాగం స్థల పరిశీలన చేయనున్న కలెక్టర్ చంద్రశేఖర్, ASP రమేష్
..

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆగస్టు 10న నాగార్జునసాగర్ వద్ద ఘనంగా వరుణ యాగం..

తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, జలాశయాలు నిండిపోవడంతో పాటు రైతులకు సస్యశ్యామలం కలగాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆగస్టు 10న ప్రత్యేక వరుణ యాగం నిర్వహించనున్నారు.
యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు, సిద్ధాంతులు నిర్ణయించిన శుభముహూర్తం ప్రకారం నాగార్జునసాగర్ డ్యామ్ తీరంలోని విజయవిహార్ ప్రాంగణంలో ఈ యాగం జరగనుంది.
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మహాయాగంలో కృష్ణా, గోదావరి నదులు, చెరువులు జలకళ సంతరించుకోవాలని, రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు, యాగ క్రతువులు నిర్వహిస్తారు.
రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. సాయంత్రం జరిగే మహత్తర పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు.
ప్రకటన జారీ చేసిన వారు:
శ్రీ ఎంఎస్‌ఎన్ రెడ్డి, చైర్మన్, యాదగిరిగుట్ట దేవస్థానం ధర్మకర్తల మండలి.