నాగార్జునసాగర్కు కొనసాగుతున్న వరద.. 98 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో..
నల్గొండ జిల్లా: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతోంది.
ప్రస్తుతం ప్రాజెక్టుకు 98,344 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. దిగువకు 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 515.10 అడుగులుగా నమోదైంది.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.045 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 140.3150 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో, నీటిమట్టాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.