బెంగళూరులో చైన్ స్నాచర్ల బీభత్సం: మహిళ మంగళసూత్రం లాక్కొని పరారీ..!

బెంగళూరులో చైన్ స్నాచర్ల బీభత్సం:
మహిళ మంగళసూత్రం లాక్కొని పరారీ
బెంగళూరు: నగరంలో చైన్ స్నాచర్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. పీణ్య సమీపంలోని దొడ్డబిదరకల్లు ప్రాంతంలో ఓ మహిళ నుంచి దుండగులు మంగళసూత్రం లాక్కొని పరారైన ఘటన చోటుచేసుకుంది.
విజయమ్మ అనే మహిళ నిన్న తెల్లవారుజామున సుమారు 5:10 గంటలకు దుకాణానికి వెళ్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమెపై దాడి చేశారు. బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి ఒక్కసారిగా మహిళపైకి దూకి ఆమెను కింద పడేశాడు. అనంతరం ఆమె నోరు మూసి, ఎంతగా కేకలు వేసినా వదలకుండా సుమారు 25 గ్రాముల బరువున్న బంగారు మంగళసూత్రాన్ని లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం వేళల్లో మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.