వారానికి మూడు రోజుల సర్వీసులు

వారానికి మూడు రోజుల సర్వీసులు

కొత్త విమాన సేవలు వారానికి మూడు రోజులు-మంగళవారం, గురువారం, శనివారం అందుబాటులో ఉంటాయి. ఇండిగోకు చెందిన 6E 6501 విమానం కోల్‌కతా నుంచి మధ్యాహ్నం 2.15 గంటలకు బయలుదేరి 3.25 గంటలకు వారణాసి చేరుతుంది. అక్కడి నుంచి 3.55 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అదేవిధంగా 6E 6502 విమానం విజయవాడ నుంచి సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి రాత్రి 8.15 గంటలకు వారణాసి చేరుతుంది. అక్కడ 8.50 గంటలకు బయలుదేరి రాత్రి 10.15 గంటలకు కోల్‌కతా చేరుతుంది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రత్యక్షంగా హాజరయ్యారు. ప్రారంభ విమానంలో ప్రయాణించిన వారికి తొలి బోర్డింగ్ పాస్‌లను వారు అందజేశారు