రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం.

రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం

పార్టీ గీత దాటితే సీఎం సహా ఎవరినైనా సహించేది లేదు

బహిరంగ విమర్శలు చేయడం తీవ్ర క్రమశిక్షణారాహిత్యం

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏఐసీసీ ఇన్‌చార్జ్ దృష్టికి తీసుకెళ్లి చర్యలపై చర్చిస్తా

* టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.

కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ గీత దాటి ఎవరైనా బహిరంగంగా విమర్శలు చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సహా పార్టీకి చెందిన ఎవరైనా సరే క్రమశిక్షణకు లోబడి పనిచేయాల్సిందేనని తేల్చిచెప్పారు.
రాజగోపాల్‌రెడ్డి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర క్రమశిక్షణారాహిత్యానికి దారితీస్తాయని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని ఏఐసీసీ ఇన్‌చార్జ్ దృష్టికి తీసుకెళ్లి, తదుపరి చర్యలపై చర్చిస్తానని వెల్లడించారు.
పార్టీ అంతర్గత విషయాలను బహిరంగ వేదికలపై ప్రస్తావించడం సరికాదని, ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే పార్టీ వేదికపైనే చర్చించుకోవాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. దీంతో రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.