పెట్రోల్ ఎగుమతులపై.. కేంద్రం కీలక నిర్ణయం

పెట్రోల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ సున్నా.. కేంద్రం కీలక నిర్ణయం

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం విండ్‌ఫాల్ పన్ను విధానంలో కీలక మార్పులు చేసింది. పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై విధించే సుంకాలను తగ్గిస్తూ శనివారం కొత్త ఆదేశాలు జారీ చేసింది…
ఆగస్ట్ 15న కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ సహా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్‌ ఎగుమతులపై విధించే విండ్‌ఫాల్ టాక్స్ రేట్లను తగ్గించింది. ఇక్కడ పెట్రోల్‌పై ఎక్స్‌పోర్ట్ డ్యూటీని ఏకంగా జీరోకు తగ్గించడం విశేషం. ఇక డీజిల్, ఏటీఎఫ్‌పై విండ్‌ఫాల్ టాక్స్ వరుసగా లీటరుపై రూ. 24, రూ. 19.5 చొప్పున ఉన్నాయి. ఈ అర్ధరాత్రి నుంచే కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి

కొత్త పన్ను రేట్లు శనివారం నుంచే అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా పెట్రోల్ ఎగుమతులపై గతంలో లీటరుకు రూ.3.50గా ఉన్న విండ్‌ఫాల్ పన్నును పూర్తిగా సున్నాకు తగ్గించింది.

ఈ నిర్ణయంతో దేశీయ చమురు శుద్ధి సంస్థలు, ఎగుమతిదారులకు గణనీయమైన ఊరట లభించనుంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.