సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన వాక్యాలు చేసిన సుస్మిత. ..!.రేవంత్ రెడ్డి ఆయన సోదరుని అక్రమాల చిట్టా నా దగ్గర కుప్పలు కుప్పలుగా ఉన్నాయి…!

కొండా సుష్మిత పటేల్ హాట్ కామెంట్స్..

• పరకాల గడ్డ కొండా దంపతుల అడ్డ…

పరకాలలో కాబోయే ఎమ్మెల్యే నేనే… రాబోయే మరో 20 ఏళ్లు ఎమ్మెల్యేగా నేనే కొనసాగుతా…

ఏఐసీసీ,టీపీసీసీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ అంటే నాకు చాలా గౌరవం ఉంది… వారి గౌరవాన్ని కించపరిచే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు._

సీఎం రేవంత్ రెడ్డి పై సంచలన వాక్యాలు చేసిన సుస్మిత.

రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి నా లేక ఆయన సోదరుడా..

రేవంత్ రెడ్డి ఆయన సోదరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.

నియంత పాలనతో బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి ఆయన సోదరుని అక్రమాల చిట్టా నా దగ్గర కుప్పలు కుప్పలుగా ఉన్నాయి…

ఒక్కొక్కటిగా విప్పి ఆయన బాగోతాన్ని బయటపెడతా…

కొండా దంపతుల ఇలాకలో వచ్చి రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా…

డైపర్ వేసుకుని తిరుగుతున్న రేవురికి మళ్లీ గెలిపిస్తానంటే ఇక్కడ మేము ఊరుకుంటామా…

రేవంత్ రెడ్డి తో పాటు, రేవూరి ప్రకాష్ రెడ్డికి సవాల్ విసురుతున్న…

ఇప్పుడే రాజీనామా చేసి పరకాల లో బై ఎలక్షన్స్ పెట్టాలి…

నేనో రేవూరి ప్రకాష్ రెడ్డో తేల్చుకుంటాం…

రేవంత్ రెడ
తెలంగాణ కాంగ్రెస్‌లో పరకాల అసెంబ్లీ టికెట్ వ్యవహారం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి..

“రేవంత్ రెడ్డి నువ్వొచ్చినా, నీ అయ్యొచ్చినా, నీ తాతొచ్చినా పరకాల ఎమ్మెల్యేను నేనే. కచ్చితంగా నేనే నిల్చుంటా.. నేనే గెలుస్తా” అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని రాజీనామా చేయించి, ఆయన స్థానంలో తనపై పోటీకి రావాలని సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు.
తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా రేవంత్‌రెడ్డిపై గెలుస్తానని కొండా సుస్మిత వ్యాఖ్యానించారు. అదే సమయంలో టికెట్ల కేటాయింపుపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
“ఒకవైపు జెన్ జీకి టికెట్లు ఇవ్వాలి అంటారు.. మరోవైపు రేవూరి ప్రకాశ్‌రెడ్డికి టికెట్ ఇస్తా అంటారు” అంటూ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రస్తుతం “అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్” నడుస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్‌లోని అసలు కార్యకర్తలు, సభ్యులు ఎవరూ ఆనందంగా లేరని ఆమె ఆరోపించారు. తనకు కౌంటర్ ఇస్తే ప్రెస్ క్లబ్‌లో కూర్చొని రేవంత్‌రెడ్డి వ్యవహారాలన్నింటినీ బయటపెడతానంటూ కొండా సుస్మిత హెచ్చరించడం రాజకీయంగా మరింత సంచలనంగా మారింది.
పరకాల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్‌పై ఇప్పటికే కొనసాగుతున్న చర్చకు ఈ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.