తెలంగాణలో సినిమా టికెట్ ధరలకు కొత్త నిబంధనలు..

తెలంగాణలో సినిమా టికెట్ ధరలకు కొత్త నిబంధనలు..

హైదరాబాద్: సినిమా టికెట్ ధరలు, థియేటర్ల నిర్వహణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో వివిధ కేటగిరీలకు అనుగుణంగా టికెట్ ధరల పరిమితులను ప్రభుత్వం ఖరారు చేసింది.

ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం నాన్‌-ఏసీ థియేటర్లలో నాన్‌-ప్రీమియం టికెట్ ధర కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.70గా ఉంటుంది. అదే థియేటర్లలో ప్రీమియం టికెట్ల ధర రూ.50 నుంచి రూ.100 వరకు నిర్ణయించారు.

ఏసీ థియేటర్లలో నాన్‌-ప్రీమియం టికెట్ల ధర రూ.50 నుంచి రూ.150 వరకు, ప్రీమియం టికెట్ల ధర రూ.100 నుంచి రూ.200 వరకు ఉండేలా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

అలాగే స్పెషల్ థియేటర్లలో నాన్‌-ప్రీమియం టికెట్ల ధరను కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.250గా ప్రభుత్వం ఖరారు చేసింది.

సినిమా థియేటర్లలో టికెట్ ధరల విషయంలో స్పష్టత తీసుకురావడంతో పాటు, థియేటర్ల నిర్వహణకు సంబంధించిన అంశాలను కూడా నియంత్రించే ఉద్దేశంతో ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది…