ఒక్కసారిగా కుప్పకూలిన బంగారు గని,, 80 మంది మృతి..!

గోల్డ్ మైన్ కుప్పకూలి ఘోర ప్రమాదం ఆఫ్రికా దేశమైన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో ఒక్కసారిగా బంగారు గని కుప్పకూలి తీవ్ర విషాదం నింపింది. పలువురి ఆచూకీ ఇంకా లభ్యం కావాల్సి ఉంటే ప్రాణనష్టం భారీగా ఉండే అవకాశం ఉందని, ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

. గని ప్రాంతంలో భూమి కృంగిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని కూడా సర్కార్ స్పష్టం చేసింది. ఆ దేశంలో ఆర్ముడ్ గ్రూప్స్ అక్రమ బంగారు తవ్వకాలు, డ్రగ్స్ రవాణాకు పాల్పడుతున్నాయి. కాగా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశంలో కూడా గోల్డ్ మైన్ కుప్పకూలి 80 మందికి పైగా మృతి చెందారు.

కొలంబియా దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. నైరినో (Narino) ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఒక బంగారు గని కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో కనీసం 80 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక ప్రభుత్వ అధికారి ఫ్రెడీ గేజ్ తెలిపారు. కొలంబియాలోని నైరినో వంటి నియంత్రణ లేని గనులలో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. సాధారణంగా గ్యాస్ లీకేజీ పేలుళ్లు ఎక్కువగా జరుగుతుంటాయని భావించినప్పటికీ, తాజా ప్రమాదానికి అలాంటి పేలుళ్లు కారణం కాదని స్థానిక అధికారులు స్పష్టం చేశారు..

గని అడుగుభాగాన్ని బలహీనపరిచే విధంగా ‘సరికాని త్రవ్వకాలు’ జరగడం వల్లే ఈ కొండచర్యలు విరిగిపడ్డాయని గవర్నర్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదం జరిగిన ప్రాంతం చాలా నిటారుగా ఉండటం, నేల అస్థిరంగా మారడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈక్వెడార్ సరిహద్దులో ఉన్న నైరినో ప్రాంతం అక్రమ మైనింగ్‌కు కేంద్రంగా మారింది. సాయుధ గ్రూప్‌ల అజమాయిషీలో సాగుతున్న ఈ అక్రమ బంగారు వ్యాపారంతో పాటు డ్రగ్స్ రవాణా, బెదిరింపులు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.