నాపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన డాన్సర్ మాధురి రాథోడ్…!
డాన్సర్ మాధురి ఫిర్యాదు..
*🔹నన్ను అనవసరంగా కొట్టారు*
నాపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన మాధురి రాథోడ్.
_• ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనను బూతులు తిడుతూ అకారణంగా తనపై చేయి చేసుకుందని, ఆమెపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫోక్ సాంగ్స్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్ ._
తనపై ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో పలువురు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు..తన వీడియోలు చిత్రీకరించడమే కాకుండా, తన ఐఫోన్ కూడా దొంగిలించారని ఫిర్యాదు చేసిన మాధురి రాథోడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న వేములవాడ పోలీసులు.
ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ వేములవాడ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. తన వ్యక్తిగత పరువుకు భంగం కలిగించడమే కాకుండా, భౌతిక దాడికి పాల్పడ్డారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నెల 19వ తేదీన తోటి డాన్సర్ ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనపై అకారణంగా దాడికి దిగి, అసభ్యకర పదజాలంతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఆ ఘర్షణ సమయంలో తన విలువైన ఐఫోన్‌ను కూడా దొంగిలించారని ఆమె ఆరోపించారు. సోషల్ మీడియా ద్వారా తన క్యారెక్టర్‌ను దిగజార్చేలా దుష్ప్రచారం చేశారని, దీనివల్ల సమాజంలో తన గౌరవానికి తీవ్ర విఘాతం కలిగిందని మాధురి వాపోయారు..మాధురి రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన వేములవాడ పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. శరణ్యతో పాటు ఆమెకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని మీడియా కంపెనీలు, సోషల్ మీడియా ఛానెళ్లపై కూడా కేసులు నమోదు చేసినట్లు వేములవాడ సీఐ వీరప్రసాద్ తెలిపారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని, ఒక మహిళ గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో జరుగుతున్న దుష్ప్రచారంపై కూడా ప్రత్యేక దృష్టి సారించి, బాధ్యులపై ఐటీ యాక్ట్ కింద విచారణ చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు..