బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం.
కాంగ్రెస్ 1000 రోజుల దగాపై BRS సమరభేరి-కేటీఆర్.
సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్త నిరసనలు-
కాంగ్రెస్ 420 హామీలతో ప్రజలను మోసం చేసింది
కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి-KTR..
కాంగ్రెస్పై బీఆర్ఎస్ సమరభేరి.
బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో “కాంగ్రెస్ 1000 రోజుల దగా” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ హామీలు, వాటి అమలు తీరుపై ప్రజలకు వివరించాలని కేటీఆర్ సూచించారు.
“1000 రోజుల పాలనలో కాంగ్రెస్ చేసిన దగా, ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలి” అంటూ బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.