ఏపీలోని వారందరికి గుడ్‌న్యూస్.. అక్టోబర్‌ నుంచి కొత్త విధానంలో ఫించన్‌ పంపిణీ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వితంతువులకు పింఛన్‌‌లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో దాదాపు 2 లక్షల మంది వితంతువులకు పింఛన్లు అందలేదని అధికారులు గుర్తించారు. ఐదేళ్లలో 5.50 లక్షల మంది వితంతువులుగా మారారు.. అనర్హులను తొలగించిన తర్వాత కూడా 2 లక్షల మందికి పింఛను అందలేదు. అయితే గతంలో పింఛను ఇవ్వడానికి 6 అంచెల తనిఖీ చేసినా వీరు అర్హత సాధించారు. ఎందుకు పింఛను ఇవ్వలేదో ఇప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో పింఛన్లు ఎందుకు ఆగిపోయాయో తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. వీరిపై అధికారులు ఇప్పుడు దృష్టి సారించారు. ఈ 2 లక్షల మంది వివరాలను గ్రామ, వార్డు సచివాలయాలకు పంపారు. మూడు రోజుల్లో వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు.. ఆ సమాచారం ఆధారంగా కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 71,380 స్పౌజ్ పింఛన్లను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వీటిని పంపిణీ చేయాలని భావించారు.. కానీ వాయిదా పడింది. రాష్ట్రంలో భర్త చనిపోతే భార్యకు పింఛన్ అందించే స్పౌజ్ పింఛన్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.