భర్త చనిపోతే బొట్టు,గాజులు ఎందుకు తీసేయాలి?..యాంకర్ అనసూయ..

మూడేళ్లుగా ఒక ఆలోచన నన్ను తినేస్తుంది..భర్త పోతే కట్టు, బొట్టు తీసేయాలని ఎక్కడ రాసుంది?: యాంకర్ అనసూయ..
https://www.instagram.com/reel/DcXoeBGPnxQ/?igsi=MXNhbXcxN3gzdXdnaA==.

తల్లి జీవితాన్ని ఉదాహరణగా చెబుతూ అనసూయ ఎమోషనల్ కామెంట్స్.. నెట్టింట హాట్ డిబేట్
టాలీవుడ్ ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారారు. సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు సామాజిక అంశాలపైనా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేసే అనసూయ.. తాజాగా మహిళల కట్టు, బొట్టు, గాజులు, పూలు వంటి సంప్రదాయ అలంకరణలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
తన తల్లి వ్యక్తిగత జీవితాన్ని ఉదాహరణగా తీసుకున్న అనసూయ.. తండ్రి మరణం తర్వాత తల్లి సంప్రదాయ అలంకరణలకు దూరమైన విషయం తనను మూడేళ్లుగా బాధిస్తోందని భావోద్వేగంగా చెప్పారు. తండ్రి చనిపోవడానికి ముందు తన తల్లి కళ్లకు కాటుక, నుదుట బొట్టు, రంగురంగుల గాజులు, తలలో పూలతో ఎంతో అందంగా ఉండేదని గుర్తుచేసుకున్నారు.
అయితే తండ్రి మరణం తర్వాత ఆ అలంకరణలన్నింటినీ తల్లి వదిలేయడం తనను తీవ్రంగా కలచివేసిందని అనసూయ తెలిపారు. చిన్నప్పటి నుంచే అమ్మ, అమ్మమ్మలు ఆడపిల్లలకు గాజులు, గజ్జెలు, కాటుక, గోరింటాకు వంటి అలంకరణలను పరిచయం చేస్తారని.. అలాంటి వాటిని పెళ్లి తర్వాత భర్తతో ఎందుకు ముడిపెడుతున్నారని ఆమె ప్రశ్నించారు.
“భర్త చనిపోయిన తర్వాతే బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి?” అనే ప్రశ్నను అనసూయ లేవనెత్తారు. ఒక మహిళకు అలంకరణలు ధరించాలా? వద్దా? అనేది ఆమె వ్యక్తిగత ఇష్టానికి సంబంధించిన అంశంగా చూడాలని ఆమె అభిప్రాయపడ్డారు.
అనసూయ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఆమె ప్రశ్నలో ఆలోచించాల్సిన అంశం ఉందంటూ మద్దతు ఇస్తుండగా.. మరికొందరు సంప్రదాయాలను ప్రశ్నించే విధానాన్ని తప్పుబడుతున్నారు. ముఖ్యంగా అనసూయ వీడియోలో నుదుట బొట్టు లేకపోవడాన్ని కొందరు నెటిజన్లు ప్రస్తావిస్తూ ట్రోల్ చేస్తున్నారు.
ఇలా అనసూయ చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. సంప్రదాయాలు, వ్యక్తిగత స్వేచ్ఛ, మహిళలపై సామాజిక ఆంక్షలు వంటి అంశాలపై నెటిజన్లు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…ఆడపిల్లలకు పుట్టుకతోనే అమ్మ, అమ్మమ్మలు గాజులు, గజ్జెలు, కాటుక, గోరింటాకు వంటి అలంకారాలను అలవాటు చేస్తారని.. అలాంటి వాటిని కేవలం పెళ్లితోనే ఎందుకు ముడిపెట్టాలని అనసూయ సూటిగా ప్రశ్నించారు. “భర్త చనిపోగానే బొట్టు, గాజులు, గజ్జెలు తీసేయాలని ఎక్కడ రాసి ఉంది? ఒకవేళ ఆ అలంకారాలు తీసేయాల్సి వస్తే, వాటిని మనకు పరిచయం చేసిన అమ్మ లేదా అమ్మమ్మ మరణించినప్పుడు తీసేయాలి కానీ, భర్త మరణంతో వీటికి ఎందుకు లింక్ పెట్టాలి?” అంటూ దశాబ్దాలుగా ఉన్న ఆచారాలపై తన మనసులోని ప్రశ్నలను నెటిజన్లతో పంచుకున్నారు.