ఘోర రోడ్డు ప్రమాదం. ఆరుగురు దుర్మరణం..

సూర్యాపేట్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోదాడ మండలం దొరకుంట శివారులో ఓ ట్రావెల్ బస్సు.. కంటైనర్ వాహనాన్ని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు స్పాట్‌లో మృతి చెందగా, దాదాపు 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు…

దొరకుంట శివారులో రోడ్డుపై ఆగివున్న కంటైనర్ లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఆరుగురు మృతిచెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..