ఛత్తీస్‌గఢ్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం..

ఛత్తీస్‌గఢ్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం.

ల్యాండింగ్ సమయంలో పేలిన విమానం టైరు.
పైలట్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం.
37 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది సురక్షితం.

బిలాస్‌పూర్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఘటన.

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ ఎయిర్ పోర్టులో ఒక విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం దిల్లీ నుండి బిలాస్‌పూర్ వచ్చిన అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ రన్‌వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో హఠాత్తుగా టైరు పేలిపోయింది. అయితే పైలట్ చాకచక్యంతో వ్యవహరించడంతో విమానంలో ఉన్న 41 మంది సురక్షితంగా బయటపడ్డారని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI) కథనం వెల్లడించింది. అలయన్స్ ఎయిర్ సంస్థకు చెందిన విమాన ప్రతినిధిని ఉటంకిస్తూ ఈ విషయాన్ని ప్రతినిధులు ధృవీకరించారు….అలయన్స్ ఎయిర్‌కు చెందిన 9I613 విమానం ఢిల్లీ నుండి బిలాస్‌పూర్‌ వెళుతుండగా ఎడమవైపు టైర్‌ పేలిపోయింది….