రష్యా నుంచి పాకిస్తాన్లోని కరాచీకి వెళ్తున్న ఓ నౌకపై (ఎంవీ బేరియన్) డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో నౌకలోని సిబ్బంది నివాస ప్రాంతం దెబ్బతినడంతో మంటలు చెలరేగాయి..దాడి సమయంలో నౌకలో 23 మంది భారతీయ నావికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారని తెలుస్తోంది. నౌక సమీపంలో మరో డ్రోన్ కూడా కనిపించినట్లు సమాచారం.
హోర్ముజ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తత
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో నౌకాయానానికి ముప్పు పెరిగింది..