పాకిస్తాన్ షాక్…రాతి చెక్‌డ్యామ్‌ వలన సింధూ నదిలో నీటిమట్టం సమర్థవంతంగా భారత్ వినియోగం..

సింధూ నదీ జలాలను సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు భారత్ నిర్ణయించింది. దీంతో లద్దాఖ్‌లోని ఉప్పీ ప్రాంతంలో సింధూ నదిపై సిమెంట్ వినియోగం లేకుండా భారత్ తొలి రాతి చెక్‌డ్యామ్‌ను నిర్మించింది..సిమెంట్‌, కాంక్రీట్‌ ఉపయోగించకుండా సహజ రాళ్లతో ఈ నిర్మాణాన్ని చేపట్టడం విశేషం.

ఈ రాతి చెక్‌డ్యామ్‌ వలన సింధూ నదిలో నీటిమట్టం దాదాపు 10 అడుగుల మేర పెరిగింది. దీంతో గతంలో నదిలో నీరు లోతుగా ప్రవహించడం వల్ల పంపుల ద్వారా నీటిని తీసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు ఇప్పుడు సాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఈ చెక్ డ్యామ్ సుమారు 40 మిలియన్ లీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యం కలిగి ఉంది. నిల్వ చేసిన నీటిని ఇగూ-ఫే (Igoo-Phey) సాగునీటి కాలువ ద్వారా పొలాలకు తరలించనున్నారు. ముఖ్యంగా వసంతకాలంలో విత్తనాలు వేసే సమయంలో నీటి కొరతను అధిగమించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.