బోరునా ఏడిచిన సుస్మిత..
వరంగల్: మాజీ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడంపై ఆమె కుమార్తె కొండా సుస్మిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు..తన తల్లి ఏం తప్పు చేసిందని ఇంతగా అవమానించారని ప్రశ్నిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ కుటుంబంపై ఇంత పగ పెంచుకుంటారని తాను ఊహించలేదని వ్యాఖ్యానించారు. తాను మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పు లేదని, తన తల్లి బాధ్యతలు నిర్వహించిన శాఖలో చిన్న అవినీతి కూడా జరగలేదని ఆమె పేర్కొన్నారు.కొండా సుస్మిత మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన వ్యాఖ్యల కారణంగా తల్లి మంత్రి పదవిని కోల్పోవడాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Konda Sushmitha : ఎక్కి ఎక్కి ఏడ్చిన కొండా సుస్మిత..!
”మా అమ్మ ఏం తప్పు చేసిందని ఆమెను ఇంతగా అవమానించారు?” అంటూ ప్రశ్నించారు.తల్లి నాయకత్వం వహించిన శాఖలో ఎలాంటి చిన్న అవినీతి కూడా జరగలేదని సుస్మిత అన్నారు. తాను చేసిన వ్యాఖ్యల్లోనూ తప్పేమీ లేదని స్పష్టం చేశారు. అయితే తన మాటల కారణంగా తల్లికి మంత్రి పదవి పోవాల్సి వస్తుందని ముందే తెలిసి ఉంటే.. తాను ఆ వ్యాఖ్యలు చేసేదాన్ని కాదని అన్నారు.రేవంత్ రెడ్డి తమ కుటుంబంపై ఇంత స్థాయిలో పగ పెంచుకుంటారని అసలు ఊహించలేదని సుస్మిత వ్యాఖ్యానించారు. పార్టీలో తాను ఉండాలి లేదా తన తల్లి ఉండాలి అనే స్థాయికి ముఖ్యమంత్రి వ్యవహరిస్తారని తాను అనుకోలేదన్నారు. గతంలో తమ కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు.
Konda Sushmitha వైఎస్సార్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి.. సుస్మిత భావోద్వేగ వ్యాఖ్యలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతోనే తన తల్లిదండ్రులు రాజకీయాల్లో ఈ స్థాయికి ఎదిగారని సుస్మిత పేర్కొన్నారు. అలాంటి వారిని ఇప్పుడు ఇంతగా ఇబ్బందులకు గురిచేయడం సరికాదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.తన తల్లిని ఇంత అవమానకర పరిస్థితిలో చూడాల్సి వస్తుందని ముందే తెలిసి ఉంటే.. తాను ఎలాంటి వ్యాఖ్యలు చేసేదాన్ని కాదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ కుటుంబంతో ఇంతటి విభేదాలు పెంచుకుంటారని అనుకోలేదని మరోసారి చెప్పారు. గతంలో అనేక కేసుల్లో ఇరుక్కుని తమ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని ప్రజలకు తెలుసని సుస్మిత పేర్కొన్నారు….
నేను మాట్లాడితే మా అమ్మను బలి చేయడం సరికాదు. ఎంపీపీ నుండి ఈ స్థాయికి సురేఖ ఎదిగారు, కానీ రేవంత్ రెడ్డి ఆమెపై పగ పెంచుకోవడం సరైనది కాదు. తన శాఖలో ఎలాంటి తప్పు జరగలేదు, మా అమ్మ ఏం తప్పు చేసింది?” అని ప్రశ్నించారు.
అయితే, ఈ నెల సెప్టెంబర్ మూడవ తేదీన కొండా సురేఖను మంత్రి పదవి నుండి ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి చేసిన సిఫార్సుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఆ తర్వాత లోక్‌సభకు రేవంత్ వెళ్ళగా, ఆయన ముందే గవర్నర్ లేఖపై సంతకం చేశారు. వెంటనే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో సురేఖపై కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలగింపు అనంతరం వెంటనే ఆమె బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఎస్కార్ట్‌లో ఉండే ఇంటెలిజెన్స్ 4+4 గన్ మెన్లను కూడా తొలగించారు. హనుమకొండలోని ఆమె నివాసం వద్ద కూడా బందోబస్తును రద్దు చేశారు.
కొండా సుస్మిత వ్యాఖ్యలు:
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొండా సురేఖ బర్తరఫ్కు కారణమైన సుస్మిత వ్యాఖ్యలు ఇవే.. సీఎం అవ్వగానే రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయని కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకాలలో రేవురి ప్రకాష్ రెడ్డి పోటీకి రేవంత్ ఎలా అవకాశం ఇస్తారంట? డైపర్లు వేసుకుని తిరిగే ఊరికి టికెట్ ఎలా ఇస్తారంటా? అని ఆమె ప్రశ్నించారు. రేవంత్ సోదరులు రాష్ట్రం దోచుకుంటున్నారని, సీఎంకు ఒకవైపు పొంగు ఉంది, అది ఎక్కువ సేపు పొంగదన్నారు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని కూడా ఆమె ప్రకటించారు.
ఈ వ్యాఖ్యలకు కొండా సురేఖ కూడా రియాక్ట్ అయ్యారు. సుస్మిత చేసిన వ్యాఖ్యల వివాదంలో తన తప్పులేదని ఆమె ఖర్గేకు కూడా స్పష్టం చేశారు. “నా కూతురికి ఏదైనా మాట్లాడే హక్కు ఉంది, నేను వద్దని చెప్పలేను. బీసీ మహిళలమైనా నాపై చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు. నేను పద్మశాలి, నా భర్త మున్నూరు కాపు. ఈ సామాజిక వర్గాల ఓటర్లు రాష్ట్రంలో 16% ఉన్నారు” అని ఆమె పేర్కొన్నారు.
కొండా సురేఖను తొలగించకముందు ఆమె సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. మరో మంత్రి సీతక్కతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి, రేవంత్ రెడ్డికి బొట్టు పెట్టి రాఖీ కట్టారు. ఆ సమయంలో ఇరువురూ నవ్వుతూ సరదాగా కనిపించడంతో వివాదం ముగిసిందని అందరూ అనుకున్నారు.
కాంగ్రెస్‌లోనే ఉంటాం..
అయితే సుస్మిత వ్యాఖ్యలపై ఆమె తండ్రి మురళి కూడా స్పందించారు. ఆమె వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదని, అవి ఆమె వ్యక్తిగత నిర్ణయాలని చెప్పారు. ప్రశ్నించే హక్కు తమకు లేదని, ఏ పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీని వీడబోమని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, కొండా సురేఖ చిన్నారెడ్డి ఎపిసోడ్లో హైకమాండ్ తరపున రేవంత్ రెడ్డి క్లియర్ మెసేజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన చెప్పిందే ఫైనల్ అని, మిగిలిన అసంతృప్తి నేతలకు ఒక పరీక్షగా లేదా హెచ్చరికగా భావించవచ్చు.