నేడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీసీ కమిషన్ పర్యటన. వరుస గ్రామ బహిష్కరణలపై విచారణ చేపట్టనున్న కమిషన్.!

నేడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీసీ కమిషన్ పర్యటన.

వరుస గ్రామ బహిష్కరణలపై విచారణ చేపట్టనున్న కమిషన్.

20 గ్రామాల బాధితులతో ముఖాముఖి..

గ్రామ అభివృద్ధి కమిటీలపై పోలీసులతో సమీక్ష..

ఇటీవల గ్రామ బహిష్కరణలపై విచారణ: వివిధ గ్రామాల్లో విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీల (VDC) ఆధ్వర్యంలో జరుగుతున్న వరుస సామాజిక బహిష్కరణలపై కమిషన్ ప్రధానంగా దృష్టి సారించింది. ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులపై జరిగిన సామాజిక బహిష్కరణ ఘటనతో పాటు ఇలాంటి ఇతర ఉదంతాలపై కమిషన్ తీవ్రంగా స్పందించింది…బాధితులతో ముఖాముఖి: జిల్లాలోని దాదాపు 20 నుండి 23 ప్రాంతాలకు చెందిన సామాజిక బహిష్కరణ బాధితులతో కమిషన్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనుంది..