ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారి చూపిన మహిపాల్ రెడ్డి !
పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని తమలో కలిపేసుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎర్రవెల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి ఆహ్వానించారు కూడా.
ఆయనపై గతంలో అనర్హతా పిటిషన్ కూడా బీఆర్ఎస్ దాఖలు చేసింది.
పటాన్చెరులో లోకల్ కాంగ్రెస్ నేతలు కలిసే చాన్స్ లేకపోవడంతో మహిపాల్రెడ్డి మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరారు. మున్సిపల్ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ను గెలిపించారు. దాంతో కేసీఆర్ గుడ్ లుక్స్లో పడ్డారు. ఫామ్ హౌస్ గేట్లు తెరుచుకున్నాయి.
ఆయన మార్గం అసంతృప్తితో ఉన్న మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకూ దారి చూపిస్తుందా?.