భద్రాచలం MLA తెల్లం వెంకట్రావు పీఏ కల్యాణ్ అరెస్ట్..!!

.భద్రాచలం MLA తెల్లం వెంకట్రావు పీఏ కల్యాణ్ అరెస్ట్..

ఉద్యోగాల పేరుతో 54 మంది నుంచి రూ.8 కోట్లు వసూలు.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లలో డబ్బులు పోగొట్టిన కల్యాణ్‌
బాధితుల ఫిర్యాదుతో కల్యాణ్‌ను అరెస్ట్ చేశాం-భద్రాచలం డీఎస్పీ అశోక్‌కుమార్‌..

భద్రాచలం పట్టణానికి చెందిన రాయల శ్రీను అనే బాధితుడు ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించి కల్యాణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే వద్ద పీఏగా పనిచేస్తున్న పలుకుబడిని అడ్డం పెట్టుకుని కల్యాణ్ నిరుద్యోగులను ప్రలోభాలకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి దాదాపు 54 మంది నిరుద్యోగ యువతీయువకుల నుంచి సుమారు రూ.8 కోట్ల మేర భారీ మొత్తాన్ని వసూలు చేసినట్లు సమాచారం..భద్రాచలం MLA తెల్లం వెంకట్రావు పీఏ కల్యాణ్ అరెస్ట్…మొత్తాన్ని కల్యాణ్ ఆన్‌లైన్ బెట్టింగులు, వ్యసనాల కోసం వెచ్చించి పూర్తిగా పోగొట్టుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఉద్యోగాలు రాకపోగా, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కల్యాణ్‌ను అరెస్ట్ చేసి, ఆయన వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో లోతైన విచారణ జరుపుతున్నారు. నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది..