గృహ ప్రవేశాల గురించి మాకు చెప్పేది వీళ్లే.. వాళ్లకు మేం కమిషన్ ఇస్తాం…!.
*ఎక్కడైనా గృహ ప్రవేశం జరిగితే గోమాతను తీసుకెళ్లే వ్యక్తి మాకు చెప్తాడు….
అలాగే టెంట్ హౌస్ వాళ్లు, పాత ఇంటి వాచ్మెన్లు, సన్నాయి మేళం వాళ్లు చెప్తారు…. మా వాళ్లకు లొకేషన్లు అన్నీ వెళ్లిపోతాయి…. ఇల్లు కట్టిన బిల్డర్ కూడా మా వాళ్లకు లొకేషన్ పెడతారు లొకేషన్ పెట్టిన ప్రతిసారీ రూ.2 వేలు, రూ.3 వేలు కమిషన్ తీసుకుంటారు…. పూజకు వెళ్లే పంతులు కూడా లొకేషన్ పెడతాడు…. వీళ్లలో ఎవరు మాకు లొకేషన్ పెట్టినా మేం కనీసం వెయ్యి రూపాయలు కమిషన్ ఇస్తాం….! ఒకప్పుడు .200, 300 ఇచ్చేవాలం ఇప్పుడు కనీసం వెయ్యి, రెండు వేలు ఇస్తే కానీ చెప్పరు…. గోమాతను తీసుకెళ్లేవాళ్లు అయితే రూ.3 వేలు ఇస్తే కానీ చెప్పరు…!.
*అసలు దొంగలు ఎవరో తెలిసిందా…! అంటు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్ట్ లు..