జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసి అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేయనున్న BRS నేతలు.

ఢిల్లీ చేరుకున్న సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి, సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి

జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసి అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేయనున్న నేతలు..

అసెంబ్లీ వద్ద తమపై కాంగ్రెస్ ప్రభుత్వం చేయించిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారు. మహిళలు అనికూడా చూడకుండా పోలీసులు తమపట్ల అమానుషంగా ప్రవర్తించడంపై జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఫిర్యాదు చేయనున్నారు. గురువారం సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి, సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు ఢిల్లీ చేరుకున్నారు..అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న తమను గేటు వద్ద అడ్డుకొని..తమపట్ల దురుసుగా, అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలిసి అసెంబ్లీ ఆవరణలో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేసేందుకు ఓ బృందం ఢిల్లీ వెళ్లింది. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి, సత్యవతి రాథోడ్, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలు గురువారం ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం వీరు జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ కలిసి.. తమపట్ల అమానుషంగా వ్యవహరించిన పోలీసులపై కంప్లైంట్ ఇవ్వనున్నారు.