చివరి 5వ శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు..!

చివరి 5వ శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు

దేవరకొండ…..
దేవరకొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో చివరి 5 వ శ్రావణ శుక్రవారం సందర్భంగా
గోమాత సేవ, గోమాతకు గో గ్రాసం ఆర్యవైశ్య సంఘం తో పాటు, వామ్ సభ్యులు గో గ్రాసం సమర్పించినారు. అమ్మవారికి అభిషేకం, మణిదీప వర్ణన కుంకుమ పూజ, వాసవి మాత పారాయణం
తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య ఐక్యవేదిక లో సభ్యత్వం తీసుకోవాలని హైదరాబాద్ ఐక్యవేదిక నాయకులు దేవరకొండ కు విచ్చేసి ఐక్యవేదికలో సభ్యత్వం తీసుకోవాలని ఆర్యవైశ్య సంఘం వారికి తెలియజేసినారు. పూజల అనంతరం
నెల రోజులు పూజలు అందుకున్న కలశం ను వేలంపాట నిర్వహించినారు .
అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల సుబ్రహ్మణ్య శర్మ తో పాటు వారి శిష్య బృందంను ఆలయ కమిటీ వారు ప్రత్యేకంగా సన్మానం చేసినారు. వచ్చిన భక్తులందరికీ ఆలయ కమిటీ వారు మహా ప్రసాదం ఏర్పాటు చేసినారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు చీదెళ్ల వెంకటేశ్వర్లు, కార్యదర్శి సముద్రాల ప్రభాకర్, కోశాధికారి కొత్త సుబ్బారావు ఆర్యవైశ్య మహిళలు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.