థాయ్‌లాండ్‌లో సీనియర్ బౌద్ధ సన్యాసి అరెస్ట్.. !

థాయ్‌లాండ్‌లో సీనియర్ బౌద్ధ సన్యాసి అరెస్ట్.. రూ.24 కోట్ల ఆలయ నిధుల దుర్వినియోగం..

థాయ్‌లాండ్‌లోని అయుత్తయలో 14వ శతాబ్దానికి చెందిన వాట్ ఫుత్తైసవన్ ఆలయ మాజీ అధిపతి, 66 ఏళ్ల ఫ్రా వచిరయాన్ వి (లువాంగ్ ఫో అతిచోట్)ను సెప్టెంబర్ 10న పోలీసులు అరెస్టు చేశారు. ఆలయ నిధుల నుంచి సుమారు 92 మిలియన్ బాత్ (2.8 మిలియన్ డాలర్లు)కు పైగా దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై ఎంబెజిల్‌మెంట్, మనీలాండరింగ్ కేసులు నమోదయ్యాయి. ఆయనతో పాటు నిధులను దాచిపెట్టడంలో సాయపడిందన్న ఆరోపణలపై ఓ మహిళను కూడా అరెస్టు చేశారు. ఆయన నివాసంలోని సీసీటీవీ ఫుటేజీలో ఆ మహిళతో అనుచిత ప్రవర్తన కనిపించడం థాయ్ మీడియాలో సంచలనం సృష్టించింది. అరెస్టు వెంటనే ఆయన సన్యాస దీక్షను వదులుకున్నారు (defrocked). మరుసటి రోజు అతని నివాసంలో 100 మిలియన్ బాత్‌కు పైగా నగదు, బంగారం లభించినట్లు నేషన్ థాయ్‌లాండ్ నివేదించింది. థాయ్‌లాండ్ ప్రధాని అనుటిన్ చార్న్విరకుల్ సహా పలువురు ఆయన తయారు చేసిన తాయెత్తులు ధరించడం విశేషం.