7,500 కోట్ల అప్పు తీసుకోనున్న తెలంగాణ..

7,500 కోట్ల అప్పు తీసుకోనున్న తెలంగాణ..

Telangana Debts.

16న ఈ-వేలం ద్వారా తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం

_హైదరాబాద్‌, సెప్టెంబరు 13 రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 కోట్ల అప్పు తీసుకోనుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ నెల 16న నిర్వహించే ఈ-వేలం ద్వారా రుణాన్ని సేకరించనుంది._

_7.53 శాతం వార్షిక వడ్డీ, 13ఏళ్ల కాల పరిమితితో రూ.1,500 కోట్లు., 7.64 శాతం వార్షిక వడ్డీ, 18 ఏళ్ల కాల పరిమితితో రూ.2000 కోట్లు., 7.65 శాతం వార్షిక వడ్డీ, 23 ఏళ్ల కాల పరిమితితో రూ.2000 కోట్లు., 7.65 శాతం వార్షిక వడ్డీ, 29 ఏళ్ల కాల పరిమితితో రూ.2000 కోట్ల చొప్పున మొత్తం రూ.7,500 కోట్ల రుణాన్ని తీసుకోనుంది._