మాజీ మంత్రి కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ ఫోన్ కాల్..

మాజీ మంత్రి కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ ఫోన్ కాల్

పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్‌గా ఉండాలని సూచన

ఇటీవల జరిగిన పరిణామాలు, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం వంటి అంశాలపై కొండా సురేఖతో ఫోన్‌లో చర్చించిన మీనాక్షి నటరాజన్

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం కావాలని, పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉండాలని సూచన

మీనాక్షి నటరాజన్ సూచన మేరకు కొండా సురేఖ నేడు అసెంబ్లీకి వస్తుందా లేదా అనే అంశంపై చర్చలు.

మాజీ మంత్రి కొండా సురేఖకు ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్ చేశారు. ఇటీవల జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. పార్టీలో యాక్టివ్‌గా ఉండాలని సురేఖకు సూచించారు మీనాక్షి. అటు అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ గైర్హాజరవుతున్నారు..రాష్ట్ర రాజకీయాలు, పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత అంశాలు, అంతర్గత విభేదాలను పక్కనపెట్టి పార్టీ కార్యక్రమాల్లో తిరిగి చురుగ్గా పాల్గొనాలని ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్.. కొండా సురేఖకు సూచించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫార్సు మేరకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. కేబినెట్ నుంచి తప్పించిన తర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు సురేఖ గైర్హాజరు కావడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో, పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకే ఇన్‌ఛార్జ్ నేరుగా సురేఖతో మాట్లాడినట్లు సమాచారం. ఈ ఫోన్ కాల్ అనంతరం సురేఖ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది..