వినాయక చవితి వేడుకలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ దంపతులు..!

– భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు

– రామాలయంలో ఘనంగా గణనాథుడి పూజలు..

– గ్రామ సర్పంచ్ దంపతుల ప్రత్యేక పూజలు..

– గణపయ్య ఆశీస్సులతో తీదేడులో శాంతి, సౌభాగ్యం,అభివృద్ధి వెల్లివిరియాలని ఆకాంక్ష

చింతపల్లి……….
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చింతపల్లి మండలం తీదేడు గ్రామంలో వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.గ్రామంలోని రామాలయం వద్ద కొలువుదీరిన గణనాథునికి గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ స్వప్న శేఖర్ రెడ్డి గ్రామ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామంలో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని, అభివృద్ధి మరింతగా కొనసాగాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
వినాయక చవితి వేడుకలను గ్రామ ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని ఆమె ఆకాంక్షించారు.గణనాథుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ తిరుమణి పాపయ్య, బాగ్యమ్మ, మాజీ ఉప సర్పంచ్ సోనగంటి నవనీత గోవర్థనాచారి,వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్, రెడ్డి పద్మ పరమేష్, శివర్ల పర్వతాలు యాదవ్ తదితరులు, గ్రామ ప్రజలు,మర్రు రామారావు,మర్రు రజిత శ్రీనివాస రావు,సిమర్ల శ్రీను యాదవ్,కాయితి బచ్చిరెడ్డి,పల్లగుట్ట రాములు,సోనగంటి కృష్ణమాచారి,మొరుపోజు రాజు,మెరిక శంకరయ్య,మునగాల అశోక్,ఇద్దిరాములు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.