వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి గణపతి పూజాలు.

వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి గణపతి పూజాలు.

ప్రజలందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి, విజయాలు కలగాలని ప్రార్థిస్తూ… రాష్ట్ర ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.

వినాయక చవితి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి నేడు గణపతి పూజా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గోన్నారు. అనంతరం తెంగాణ ప్రజలందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి, విజయాలు కలగాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు. ఈ సందర్భంగా మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజలందరికి శుభాకాంక్షలు..
వినాయక పూజాంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుని కృపాకటాక్షాలతో తెలంగాణ ప్రజల జీవితాల్లో నిరంతంరం వెలుగులు నింపాలని ఆ దేవున్ని కోరుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలందరి బాధలు తొలగిపోయి శాంతి సౌఖ్యాలు, సకల విజయాలు కలగాలని ఆ కాణిపాక వరసిద్ధి వినాయకుని వేడుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.