కొండా సురేఖను అధిష్టానం పిలిచినట్టు మాకు సమాచారం లేదు..టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్..!

నేను బర్తరఫ్‌ అయ్యానని బాధపడటం లేదు.. అకారణంగా నన్ను మంత్రి పదవి నుంచి తొలగించారనేదే నా ఆవేదన అని మాజీ మంత్రి కొండాసురేఖ పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు కొండా సురేఖను ఢిల్లీకి రమ్మని అధిష్టానం నుండి చాలా సార్లు పిలిచారు..
కానీ పోవడం లేదు పరకాలలో సుస్మిత చూసుకుంటది.. ఇక్కడ నేను, సురేఖ చూసుకుంటామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కూడా చెప్పారు. అంతేకాదు మాకు కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి ఫోన్లు వస్తున్నాయి..
ఏ పార్టీలోకి వెళ్లొద్దని కోరారు. కాంగ్రెస్‌లోనే పుట్టాం.. కాంగ్రెస్‌లోనే పెరిగాం. వచ్చే ఎన్నికల్లోనే కాంగ్రెస్ జెండాతోనే పోటీ చేస్తామంటూ స్పష్టం కూడా చేశారు…టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొండా సురేఖను అధిష్టానం పిలిచినట్టు మాకు సమాచారం లేదు అన్నారు. మహేశ్ కుమార్‌ గౌడ్‌ చేసిన తాజా వ్యాఖ్యలు టీపీసీసీకి తెలియకుండా ఏఐసీసీ నిర్ణయాలు తీసుకుంటుందా..? అంటూ చర్చలు ఊపందుకున్నాయి.