ఆఫ్ఘనిస్తాన్ పై చాలా రోజుల తర్వాత భారత ఓపెనింగ్ జోడీ ఆరంభం నుంచే పూర్తి దూకుడు ప్రదర్శించింది. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన సీనియర్ ఆల్రౌండర్ మహమ్మద్ నబీ బౌలింగ్ను భారత బ్యాటర్లు పూర్తిగా ఊచకోత కోశారు..తొలి బంతిని అభిషేక్ శర్మ 93 మీటర్ల భారీ సిక్సర్గా మలచగా, రెండో బంతికి సింగిల్ తీసి స్ట్రైక్ ఇచ్చారు. ఆ తర్వాత స్ట్రైకింగ్లోకి వచ్చిన సంజూ శాంసన్ విధ్వంసం సృష్టించారు. మూడో బంతిని స్లాగ్ స్వీప్ చేస్తూ స్క్వేర్ లెగ్ మీదుగా 71 మీటర్ల సిక్సర్ బాదిన ఆయన, ఆపై వరుసగా రెండు అద్భుతమైన ఫోర్లు కొట్టారు. ఆఖరి బంతికి స్ట్రెయిట్ బౌండరీ మీదుగా మరో భారీ సిక్సర్ కొట్టడంతో ఆ ఒక్క ఓవర్లోనే ఏకంగా 27 పరుగులు వచ్చి చేరాయి..
సత్తా చాటిన ఇండియన్ బౌలర్ లు..
రెండో టీ20లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. నితీశ్ కుమార్ రెడ్డి (3-0-24-3), అర్షదీప్ సింగ్ (4-0-35-2), జస్ప్రీత్ బుమ్రా (4-1-25-1), అక్షర్ పటేల్ (4-0-28-1), రవి బిష్ణోయ్ (4-0-32-1) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమైంది..ఆఖర్లో రషీద్ ఖాన్ (28) బ్యాట్ ఝులిపించడంతో ఆఫ్ఘన్ జట్టు ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా ప్లేయర్లలో ఇబ్రహీం జద్రాన్ 37, రహ్మానుల్లా గుర్బాజ్ 0, సెదిఖుల్లా అటల్ 12, గుల్బదిన్ నైబ్ 10, దర్విష్ రసూలీ 26, అజ్మతుల్లా ఒమర్జాయ్ 11, మొహమ్మద్ నబీ (15), నూర్ అహ్మద్ (7 నాటౌట్), ముజీబ్ ఉర్ రెహ్మాన్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ 2-0..ఆధిక్యం సాధించింది….
మెరిసిన శాంసన్, నితీశ్…
నితీశ్ రెడ్డి(3-35) బంతితో రాణించగా.. ఆపై ఓపెనర్లు అభిషేక్ శర్మ(39) సంజూ శాంసన్(57)లు దంచేశారు..అర్ధ శతకంతో విరుచుకుపడిన సంజూను రషీద్ ఖాన్ బోల్తా కొట్టించినా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ(15 నాటౌట్) సాయంతో ఇషాన్ కిషన్(38 నాటౌట్) లాంఛనం ముగించాడు. ఏడు వికెట్ల విజయంతో సిరీస్ను పట్టేసింది టీమిండియా..అర్ధ శతకంతో విరుచుకుపడిన సంజూను రషీద్ ఖాన్ బోల్తా కొట్టించినా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ(15 నాటౌట్) సాయంతో ఇషాన్ కిషన్(38 నాటౌట్) లాంఛనం ముగించాడు. ఏడు వికెట్ల విజయంతో సిరీస్ను పట్టేసింది టీమిండియా.