ఎన్నికల రోజు అఫిడవిట్లో నేను ప్రస్తావించిన నా ఆస్తులకన్నా గజం భూమి ఎక్కువగా ఉన్నా ఆ భూమిని ప్రభుత్వ సరెండర్ చేస్తా..సీఎం రేవంత్ రెడ్డికి కవిత కౌంటర్..
ఎన్నికల రోజు అఫిడవిట్లో నేను ప్రస్తావించిన నా ఆస్తులకన్నా గజం భూమి ఎక్కువగా ఉన్నా ఆ భూమిని ప్రభుత్వ సరెండర్ చేస్తాను అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నాకు ఎక్కడో భూములు ఉన్నట్టు అబద్ధాలు చెప్పారు అసలు ఈ ముఖ్యమంత్రి పై మాకునేగ్గు లేదు.. నక్క, కేసీఆర్ గారి ఫాం హౌస్ లో ఉండే సీఎం గూఢాచారి సహా నవీన్ రావు, కొండల్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, రామేశ్వర్ రావు, ప్రతిమ శ్రీనివాస్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి అందరి భూములపై సీబీఐతో కలిసి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. అఫిడవిట్ లో చేస్తాను దానికన్నా గజం భూమి అదనంగా ఉన్నా ప్రభుత్వానికే సరెండర్ అని మరోమారు స్పష్టం చేస్తున్నాను..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తమ భూముల గురించి చేసిన ప్రకటనపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. తనకు ఎలాంటి అక్రమ ఆస్తులు లేవు అని క్లారిటీ ఇచ్చేశారు. ఎన్నికల అఫిడవిట్లో తాను ప్రస్తావించిన తన ఆస్తులకన్నా గజం భూమి ఎక్కువగా ఉన్నా ఆ భూమిని ప్రభుత్వానికే సరెండర్ చేస్తాను అని ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తన భూములకు సంబంధించి వివరిస్తున్న వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేసి మరీసమాధానం చెప్పారు.
గజం భూమి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికి ఇచ్చేస్తా
అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నా కుటుంబానికి ఎక్కడో భూములు ఉన్నట్టు అబద్ధాలు చెప్పారు అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పుకొచ్చారు. అసలు ఈ ముఖ్యమంత్రి పైనే మాకు నమ్మకం లేదు… అసెంబ్లీలో ఈరోజు సీఎం చదివిన భూముల చిట్టాలో నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణకు ఆదేశించాలి అని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. గుంపు మేస్త్రీ – గుంటనక్క ముమ్మాటికీ కలిసే ఉన్నారని మరోమారు స్పష్టం చేస్తున్నా అని చెప్పుకొచ్చారు. సీఎం ఈ రోజు అసెంబ్లీలో ప్రస్తావించిన గుంట నక్క, కేసీఆర్ ఫాం హౌస్‌లో ఉండే సీఎం గూఢచారి సహా నవీన్ రావు, కొండల్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, రామేశ్వర్ రావు, ప్రతిమ శ్రీనివాస్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి సహా అందరి భూములపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలి అని కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలను మించి ఒక్క గజం భూమి నాకు ఎక్కువగా ఉన్న.. ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న దానికన్నా గజం భూమి అదనంగా ఉన్నా ప్రభుత్వానికే సరెండర్ చేస్తానని మరోమారు స్పష్టం చేస్తున్నాను అని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు.కేసీఆర్‌కు 700 ఎకరాల ఫామ్‌హౌస్ ఉందో లేదో నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందులో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఈ విషయాన్ని కేసీఆర్ ఎందుకు వెల్లడించడంలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. విచారణలో ఆ భూమి ప్రభుత్వానిదని తేలితే దాన్ని నిరుపేద దళితులకు పంచిపెడదాం అని మరోసారి ప్రకటించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కుటుంబానికి ఉన్న భూముల వివరాలను కూడా రేవంత్ రెడ్డి సభలో వెల్లడించారు. కేసీఆర్ కుటుంబానికి సిద్దిపేటలో 67.5 ఎకరాలు, కేటీఆర్ కుటుంబానికి 123 ఎకరాలు, హరీశ్‌రావు కుటుంబానికి 30 ఎకరాలు, కవిత కుటుంబానికి 37 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. తొమ్మిది జిల్లాల పరిధిలోని 24 మండలాల్లో కల్వకుంట్ల కుటుంబానికి మొత్తం 439 ఎకరాల భూమి ఉందని ఆయన పేర్కొన్నారు.