Telangana Mlc Election Schedule,MLC Elections ….తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల..!

తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.

2027 మార్చిలో మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలకు ఖాళీలు ఏర్పడనున్న నేపథ్యంలో కొత్తగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు..
త్వరలో ఖాళీ కాబోతున్న వరంగల్- ఖమ్మం–నల్గొండ, మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం ఈసీ కసరత్తు మొదలు పెట్టింది. ఈ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు నూతన ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ నియోజకవర్గాల స్థానాల గడువు మార్చి 2027తో ముగియనుండటంతో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొత్తగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయనున్నారు. 1 నవంబర్ 2026ను అర్హత తేదీగా పరిగణనలోకి తీసుకుని ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సురభి వాణి దేవీ, వరంగల్- ఖమ్మం–నల్గొండ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న తీన్మార్ మల్లన్న పదవీ కాలం వచ్చే మార్చితో ముగియనుంది..

సెప్టెంబర్ 28, 2026 – ఓటర్ల జాబితా ప్రక్రియపై ప్రజా నోటీసు

అక్టోబర్ 15 – పత్రికల్లో తొలి పునఃప్రచురణ

అక్టోబర్ 25 – రెండో పునఃప్రచురణ

*నవంబర్ 6 – ఫారం-18 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ*

నవంబర్ 20 – ముసాయిదా ఓటర్ల జాబితా ముద్రణ పూర్తి

నవంబర్ 25 – ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ

నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు – అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ

డిసెంబర్ 25 – క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం పూర్తి

*డిసెంబర్ 30 – తుది ఓటర్ల జాబితా ప్రచురణ*

ప్రస్తుత ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారు కూడా కొత్తగా మార్చిన ఫారం-18లో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువపత్రాలు, సర్టిఫికెట్ల ధృవీకరించిన కాపీలను సమర్పించాలని స్పష్టం చేసిన ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేశారు..

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ల నమోదు షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. పాత ఓటర్లు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి..
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.. ఓటర్ల జాబితా షెడ్యూల్ రిలీజ్