మల్లెల గట్టు శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంకు రెండు లక్షల రూపాయల విరాళం..
కొండమల్లేపల్లి………
శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి
దేవస్థానము అర్ధగిరి క్షేత్రము మల్లెలగట్టు హైదరాబాదు రోడ్డు కొండమల్లెపల్లి దేవాలయమునకు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వడ్త్య రమేష్ నాయక్ రెండు లక్షల రూపాయల విరాళం ప్రకటించినారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు వడ్త్య రమేష్ నాయక్ ని దేవాలయ కమిటీ అధ్యక్షులు బండారు సుధాకర్ (రాము),కోశాధికారి పాంపాటి శ్రీధర్,
ఉపాధ్యక్షులు ఎలిమినేటి సాయి,
సహాయ కార్యదర్శులు జగదీశ్వర్ రెడ్డి, దొడ్డి సుధాకర్.
కార్యవర్గ సభ్యులు M.శ్రీనివాస్ రెడ్డి, దేవేందర్ స్వామి, బొడ్డుపల్లి నిరంజన్ గార్లు ఘనంగా శాలువాతో సన్మానించినారు.
వడ్త్య రమేష్ కి శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్షములు ఎల్లవేళలా ఉంటుందని దేవాలయ కమిటీ అధ్యక్షులు అన్నారు. శనివారం ఆర్థగిర క్షేత్రాన్ని సందర్శించి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కోసం ప్రత్యేక పూజలలో పాల్గొంటామని వడ్త్య రమేష్ నాయక్ తెలిపారు.