వీడియో గేమ్ తో మిగ్ 29 యుద్ధ విమానం కూలిపోయిందని దాని పాకిస్తాన్ ఫేక్ ప్రచారం..!

భారత్ లో మిగ్ 29 యుద్ధ విమానం కూలిపోయిందని దానికి పైలెట్ వైఫల్యమే కారణమని పాకిస్తాన్ అనుకూల మీడియా మరియు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం పట్ల భారత్ స్పందించింది . అది చిన్నపిల్లలు చూసే వీడియో గేమ్ అని దాన్ని భారత్ లో మిగ్ 29 యుద్ధ విమానం కూలిపోయినట్టు పాకిస్తాన్ మీడియా ప్రచారం చేయడం, ఆ ప్రచారానికి ప్రోత్సాహం ఇవ్వడం దురదృష్టకరమని వివరించింది . చిన్నపిల్లలు ఆడుకునే వీడియో గేమ్ లో క్లిప్పింగులు తీసి ఇలా ప్రచారం చేయడం దురదృష్టకరమని కూడా వ్యాఖ్యానించింది.
భారత్ లో మిగ్ 29 విమానం కూలిపోలేదని ఇలాంటి కట్టు కథలు మానుకోవాలని హితవు చెప్పింది..