మునగాల సబ్ స్టేషన్ల ముట్టడి.. అనంతరం దున్న పోతుకి వినతిపత్రం అందించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్..

సూర్యాపేట జిల్లా కోదాడ

కరెంటు కోతలకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మునగాల సబ్ స్టేషన్ల ముట్టడి.. అనంతరం దున్న పోతుకి వినతిపత్రం..

పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

వివిధ మండలాల నుంచి భారీగా తరలివచ్చిన రైతులు, బిఆర్ స్ పార్టీ కార్యకర్తలు..

65 నెంబర్ జాతీయ రహదారిని దిగ్బంధనం చేసిన రైతులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు..

జాతియ రహదారికి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్..

మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ…. రైతులు పొలాలు ఎన్నుతుంటే కనీసం రైతుల వైపు తిరిగి చూడని దుర్మార్గమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు…. స్థానికంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి అయ్యుండి కూడా ఈ రెండు నియోజకవర్గాలకు కనీసం మీరు అందించలేని పరిస్థితుల్లో ఉన్నాడంటే రైతుల పట్ల వారికున్న ప్రేమ ఏలాంటిదో అందరికీ అర్థమయిపోయిందని అన్నారు…. అడుగడుగునా రైతులు నిలదీస్తుంటే అక్రమ కేసులు బనాయిస్తూ అమాయకుల్ని జైలు పాలు చేస్తున్నారని అన్నారు…. ఉత్తమ్ దంపతులు ఇప్పటికైనా ఆలోచించి రైతులకి నాణ్యమైన కరెంటుతోపాటు త్రాగునీరు సాగునీరు నీరు అందించాలని అన్నారు…. లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు…