రాతపూర్వక కారణాలు చెప్పకుండా ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడం రాజ్యాంగవిరుద్ధం..
పోలీసుల అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
ఎవరినైనా అరెస్ట్ చేసే సమయంలో అతనికి అర్థమయ్యే భాషలో అరెస్టుకు గల కారణాలు లిఖితపూర్వకంగా ఇవ్వడం తప్పనిసరి అని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
అరెస్టుకు గల కారణాలు తెలుసుకోవడం ఆర్టికల్ 22(1) ప్రకారం ఓ వ్యక్తికి ఉన్న హక్కు అని సుప్రీంకోర్టు వెల్లడి
ఈ రకంగా అక్రమ అరెస్ట్ చేసిన అనంతరం ఛార్జ్షీట్ వేసినా, అరెస్టు అక్రమంగానే భావించాల్సి వస్తుందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
ఇలాంటి అరెస్టులో విడుదలైన వ్యక్తిని మళ్లీ అరెస్ట్ చేయాలంటే పోలీసులు సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదని, మేజిస్ట్రేట్ ముందు రాతపూర్వకంగా కారణాలు తెలపాల్సిందేనని వెల్లడి
మొదటి అరెస్ట్ సమయంలో నిబంధనలను ఉల్లంఘించిన అధికారికి మరోసారి దర్యాప్తు చేసే అవకాశం ఇవ్వకూడదని తేల్చి చెప్పిన న్యాయమూర్తి
ఈ నిబంధనలు ఉల్లంఘించిన పోలీస్ అధికారిపై శాఖాపరమైన చర్యలతో పాటు సర్వీస్ రికార్డుల్లో కూడా నమోదు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
పంజాబ్ రాష్ట్రం ముల్లాన్పూర్ దాఖా ఇన్చార్జ్ జస్కరణిత్ సింగ్ అక్రమ అరెస్టు కేసు విచారణలో భాగంగా ఈ తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు..
కారణాలు లిఖిత పూర్వకంగా ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే అది రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. పంజాబ్లోని ముల్లాన్పూర్ దాఖా నియోజకవర్గ ఇన్చార్జి జస్కరణ్జిత్ సింగ్ అరెస్ట్ సందర్భంగా కారణాలను రాతపూర్వకంగా అందించకపోవడంతో సుప్రీంకోర్టు ఆ అరెస్ట్ను అక్రమంగా ప్రకటించింది..