శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 9 వ చివరి రోజు రాత్రి 12 గంటల వరకు అఖండ భజన

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 9 వ చివరి రోజు రాత్రి 12 గంటల వరకు అఖండ భజన

దేవరకొండ………
దేవరకొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 9 వ రోజు చివరి రోజు సాయంత్రం పూజ అనంతరం వచ్చిన భక్తులందరికీ ఆలయ కమిటీ వారు అల్పాహారం ఏర్పాటు చేసినారు
వచ్చిన భక్తులందరూ అల్పాహారం ప్రసాదం తీసుకున్న తర్వాత
దేవాలయంలో రాత్రి 10 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు ఆపకుండా భక్తులు అందరూ అఖండ భజన చేసినారు.
భజనలతో ఆలయ ప్రాంగణం భక్తి పరవశం గా మారింది.
ఈ కార్యక్రమంలో దేవాలయం అధ్యక్షులు చీదెళ్ల వెంకటేశ్వర్లు, కార్యదర్శి సముద్రాల ప్రభాకర్, కోశాధికారి నీలా అశోక్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు, ఆర్యవైశ్య మహిళ సంఘం సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు.