ఇంధనం లేక నిలిచిపోయిన మంత్రి దామోదర రాజనరసింహ హెలికాప్టర్..!

ఇంధనం లేక నిలిచిపోయిన మంత్రి దామోదర రాజనరసింహ హెలికాప్టర్ ఆదిలాబాద్ పర్యటనకు హెలికాప్టర్‌లో వెళ్లిన మంత్రి దామోదర రాజనరసింహ తిరుగు ప్రయాణం కోసం హెలికాప్టర్‌లో ఇంధనం లేకపోవడంతో రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు బయలుదేరిన మంత్రి…

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రయాణించిన హెలికాప్టర్‌లో ఇంధనం లేకపోవడంతో నిలిచిపోయింది. ఆదిలాబాద్‌ రిమ్స్ (RIMS) హాస్పిటల్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో, బాధితులను పరామర్శించేందుకు బుధవారం మంత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. తిరుగు ప్రయాణం కోసం హెలికాప్టర్లో ఇంధనం లేకపోవడంతో ఆయన రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు బయలుదేరాల్సి వచ్చింది. కాగా, హెలికాప్టర్ సిబ్బంది మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి ఇంధనాన్ని రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు.